రెండు ఆటోలు ఢీ.. ఒకరికి గాయాలు

by Batti.Sumithra |

మండలంలోని న్యూ సాంగ్వి, కప్పన్ పెల్లి ఎక్స్ రోడ్ వద్ద శనివారం రెండు ఆటోలు ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి.

రెండు ఆటోలు ఢీ.. ఒకరికి గాయాలు
X

దిశ, మామడ : మండలంలోని న్యూ సాంగ్వి, కప్పన్ పెల్లి ఎక్స్ రోడ్ వద్ద శనివారం రెండు ఆటోలు ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ నుంచి ఖానాపూర్ వైపు వెళుతుండగా ఆటో, ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనాలు ఢీ కొనడంతో ఆటో బోల్తా పడి ప్రమాదం జరిగింది. కడెం మండలం ఎల్లగడప గ్రామానికి చెందిన కొండవేని రాజేశ్వర్ కు తీవ్రమైన గాయాలు కావడంతో 108 ఈఎంటీ సురేష్ , పైలెట్ ఆఫీస్ లు ప్రథమ చికిత్స చేసి అంబులెన్సులో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story