- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 112 సమీపంలో మూడు కార్లు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 112 సమీపంలో మూడు కార్లు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. వరుసగా కార్లు ఒకదానినొకటి ఢీ కొట్టడంతో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం ఢిల్లీలో సైతం పొగమంచు కారణంగా మూడు బస్సులు ఒకదానినొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే నాలుగు డెడ్ బాడీలను వెలికితీశారు. ఈ ప్రమాదం మర్చిపోకముందే హైదాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Read More..






