Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-07 02:38:33  IST  )

కారులో చెరువులోకి దూసుకెళ్లి నలుగురు స్పాట్‌లోని ప్రాణాలో కోల్పోయిన విషాద ఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపసల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది.

Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/చౌటుప్పల్/భూదాన్ పోచంపల్లి: కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) భూదాన్ పోచంపల్లి (Bhudan Pochampally) మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Pochampally) నుంచి భూదాన్ పోచంపల్లి (Hyderabad) వైపు వెళ్తున్న కారు జలాల్‌పురం (Jalalpur) శివారులో అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మణికంఠ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, మృతులంతా హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీ సాయంతో మృతదేహాలను చెరవులోంచి బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story