Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-27 04:41:37  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District)లో చోటుచేసుకుంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హుజూర్ నగర్ (Huzur Nagar) మండల పరిధిలోని గోపాలపురం (Gopalapuram) శివారులో బైక్‌ అదుపతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలైన దుర్గారావు (26), ఉపేందర్ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరుకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గరిడేపల్లి (Garidepally) మండలం కీతవారిగూడెం (Keetavarigudem) గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Next Story