Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఏడుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-21 09:45:41  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుజరాత్ రాష్ట్రం (Gujrat State)లోని కచ్‌ (Kutch) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఏడుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుజరాత్ రాష్ట్రం (Gujrat State)లోని కచ్‌ (Kutch) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ఉన్న 40 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story