Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్ రాష్ట్రం (Bihar State)లోని అర్వార్ (Alwar District) జిల్లాలో చోటుచేసుకుంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్ రాష్ట్రం (Bihar State)లోని అర్వార్ (Alwar District) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురు కలిసి స్కార్పియో (Scorpio) వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో అతివేగంతో స్కార్పియో అదుపు తప్పి స్పీడ్ బ్రేకర్ ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ దర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story