- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం, నలుగురి పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ రాష్ట్రం (Kerala State)లోని త్రిసూర్ (Thrissur)లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ రాష్ట్రం (Kerala State)లోని త్రిసూర్ (Thrissur)లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. త్రిసూర్ పట్టణం (Thrissur Town)లోని ఫుట్‌పాత్‌పై కొంతమంది నిద్రించారు. ఈ క్రమంలోనే అతివేగంతో దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఫుట్‌పాత్ (Footpath) పైనుంచి దూసుకెళ్లింది. ఈ దర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతులంతా తమిళనాడు రాష్ట్రానికి (Tamilnadu) చెందిన వారిగా గుర్తించారు. అనంతం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






