- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంషాబాద్ (Shamshabad) పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంషాబాద్ (Shamshabad) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొలిశెట్టిగూడ (Polishettiguda) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి దర్శన్ బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు కిషన్‌గూడ (Kishanguda) వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి దర్శన్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Next Story






