Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 10 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-15 04:08:09  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో పది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar PradesH) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj - మీర్జాపూర్ (Meerzapur) జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో పది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) - మీర్జాపూర్ (Meerzapur) జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని కోర్బా (Corba) జిల్లాకు చెందిన కొంతమంది భక్తులు బొలేరో ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతోన్న కుంభమేళాకు వెళ్తున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన భక్తులతో కూడిన బస్సు త్రివేణి సంగమం (Triveni Sangam) నుంచి వారణాసి (Varanasi)కి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాగ్‌రాజ్ - మీర్జాపూర్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న ఆ రెండు వాహనాలు (బస్సు, బొలెరో) వేగంగా ఢీకొన్నాయి.

ఈ దుర్ఘటనలో బొలెరో ఉన్న 10 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా బస్సులో ఉన్ 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Next Story