- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. తల్లీ, కూతురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో తల్లీ, కూతురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి (Mylardevpally)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో తల్లీ, కూతురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి (Mylardevpally)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుక్సానా బేగం (Ruxana Begum) దంపతులు తమ పిల్లలతో కలిసి లంగర్ హౌజ్ నుంచి ఫలక్‌నుమా బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి అతివేగంతో వచ్చిన లారీ వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రుక్సానా బేగం (Ruxana Begum), కూతురు సిఫా (Sifa) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital)కి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.






