బిగ్ బ్రేకింగ్.. కానిస్టేబుల్‌ను హత్య చేసిన షేక్ రియాజ్ ఎన్‌ కౌంటర్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-20 07:32:52  IST  )

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు.

బిగ్ బ్రేకింగ్.. కానిస్టేబుల్‌ను హత్య చేసిన షేక్ రియాజ్ ఎన్‌ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ (Sheikh Riaz) మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో.. కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) పై దాడి చేసిన రియాజ్.. అక్కడి నుంచి పారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ (Rowdy sheeter Riyaz) ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్‌‌ను పట్టుకునేందుకు ఓ యవుకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.

అనంతరం పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం రియాజ్‌ కు నాలుగు రకాల ఎక్సరేలు తీసినట్లు అధికారులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఎన్ కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story