- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ రాజధానిలో మరోసారి అలజడి.. తాజ్ ప్యాలెస్‌కు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి ఉలిక్కిపడింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి ఉలిక్కిపడింది. ఇవాళ మధ్యహ్నంలో తాజ్ ప్యాలెస్ హోటల్ (Taj Palace Hotel)కు ఆగంతకులు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపాడు. హోటల్‌లో బాంబు పెట్టామని.. మరికొద్దిసేపట్లో పేలబోతోందని అందులోని సారాంశం. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు డాగ్, బాంబ్ స్వ్కాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని విస్తృంతా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులు, బ్యాగేజీలను దూరంగా తీసుకెళ్లి చెక్ చేస్తున్నారు. ఇక శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని బాంబే హైకోర్టు అధికారులకు దక్షిణ ముంబైలోని చారిత్రక కోర్టు భవనాన్ని కూల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రాగా.. బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఎలాంటి బాంబులు లేవని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






