- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజేంద్రనగర్‌లో కలకలం.. డ్రగ్స్ ఓవర్ డోస్‌తో వ్యక్తి మృతి
డ్రగ్స్ (Drugs), గంజాయి రాష్ట్రంలోని యువతను కబళిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్/రాజేంద్రనగర్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శివరాంపల్లిలోని కెన్వర్త్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 805లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ అతని స్నేహితుడు మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్‌షిప్‌లో అక్కడే నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి నలుగురు కలిసి పార్టీ చేసుకున్నారు. అహ్మద్ అలీ (28) ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే, వారు స్పాట్‌కు చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో భాగంగా గత రాత్రి అహ్మద్ అలీతో మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అధిక మోతాదులో డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు అహ్మద్ అలీది అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపడుతున్నాడు. కాగా, అలీతో ఉన్న ముగ్గురికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా వచ్చింది.






