ఐఐటీ బాంబే మాజీ అధికారిణికి సైబర్ సెగ.. రూ. కోట్లు స్వాహా

by Naga Rani Yarlagadda |

దేశంలో డిజిటల్ అరెస్ట్ కేసులు రోజురోజుకూ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ ఐఐటీ మాజీ అధికారిణి సైబర్ మోసానికి గురయ్యారు.

ఐఐటీ బాంబే మాజీ అధికారిణికి సైబర్ సెగ.. రూ. కోట్లు స్వాహా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో డిజిటల్ అరెస్ట్ కేసులు రోజురోజుకూ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ ఐఐటీ మాజీ అధికారిణి సైబర్ మోసానికి గురయ్యారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిన 74 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశార. ఆమెకు ఫోన్ కాల్ చేసి తాము సీబీఐ అధికారులమంటూ బెదిరించారు. తొలుత టెలికాం శాఖ అధికారిగా ఒకరు కాల్ చేయగా.. నెక్స్ట్ ఐపీఎస్ అధికారిగా నటించిన మరో వ్యక్తి వీడియో కాల్ చేశాడు.

ఆమె ఆధార్ కార్డును మనీలాండరింగ్ కు వాడారని, రూ.6 కోట్లు అక్రమ లావాదేవీలు జరిపారని, సీబీఐ కేసు కూడా ఫైల్ చేసిందని భయపెట్టారు. ఈ కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే విచారణకు సహకరించాలని నమ్మబలికారు. వారిని గుడ్డిగా నమ్మేసిన ఆమె.. తన లైఫ్ టైమ్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లను బ్రేక్ చేసి మరీ అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య వాళ్లు చెప్పిన అకౌంట్లకు రూ.4.62 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. తీరా డబ్బంతా అయిపోయాక తాను మోసపోయానని తెలుసుకుని పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమెకు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తులు విదేశాల్లో ఉన్నవారైనా.. వాళ్లు చెప్పిన అకౌంట్ల ఆధారంగా సిన్హా, దినేష్ చంద్ర అని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్లు దొంగ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, డిజిటల్ అరెస్ట్ ద్వారా దోచుకున్న డబ్బును విత్ డ్రా చేసి.. అసలైన వ్యక్తులకు అందించేవారని పోలీసులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేస్తే వెంటనే 1930 నంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story