చొప్పదండిలో రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య.. ఆసుపత్రిలో కన్నుమూత

by Bhanu |

చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో రూరల్ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కడారి శ్రావణ్ (35) మృతి చెందాడు.

చొప్పదండిలో రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య.. ఆసుపత్రిలో కన్నుమూత
X

దిశ, చొప్పదండి: చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో రూరల్ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కడారి శ్రావణ్ (35) మృతి చెందాడు. కుటుంబ కలహాలతో గత వారం రోజుల క్రితం గడ్డి మందు తాగిన శ్రావణ్‌ను కుటుంబ సభ్యులు తీవ్ర స్థితిలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల పాటు చికిత్స పొందిన ఆయన, ఆదివారం చివరి శ్వాస విడిచాడు.

స్థానికుల సమాచారం ప్రకారం, శ్రావణ్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేపగా, అతని మరణానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.


Next Story