ఏపీలో దారుణం.. సెలవులకు వచ్చిన బాలికపై బాబాయ్ అత్యాచారం

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వావి వరసలు మరిచిన ఓ ప్రబుద్ధుడు వదిన కూతురుపై ప‌లుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న తిరుప‌తిలో చోటు చేసుకుంది.

ఏపీలో దారుణం.. సెలవులకు వచ్చిన బాలికపై బాబాయ్ అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వావి వరసలు మరిచిన ఓ ప్రబుద్ధుడు వదిన కూతురుపై ప‌లుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న తిరుప‌తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. తిరుప‌తిలో ఓ కార్యాల‌యంలో సీనియ‌ర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న వ్య‌క్తి ఇటీవ‌ల సెల‌వుల‌కు ఇంటికి వ‌చ్చిన త‌న భార్య అక్క కూతురిపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. వ‌ర‌స‌కు బాబాయి కావ‌డంతో బాలిక చ‌నువుగా మెలగ‌డంతో అదే అదునుగా భావించి ఆమెతో స‌న్నిహితంగా ఫోటోలు తీసుకున్నాడు. అనంత‌రం ఆ ఫోటోల‌ను, త‌నతో చేసిన చాటింగ్ ను చూపిస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డ్డాడు.

తన‌వ‌ద్ద‌కు రావాల‌ని లేదంటే అందరికీ చూపిస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్పడ్డాడు. అంతే కాకుండా మీ త‌ల్లిదండ్రుల‌ను చంపేస్తానంటూ బెదిరించి ప‌లుమార్లు బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక హైర‌దాబాద్ నుండి స‌మ్మ‌ర్ హాలిడేస్ కోసం వెళ్ల‌గా ఇటీవ‌లే ఇంటికి తిరిగి వ‌చ్చింది. ఇంటికి చేరుకున్న త‌ర‌వాత జ‌రిగిన విష‌యం త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో జ‌గ‌ద్గిరిగుట్ట పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును తిరుప‌తి ఈస్ట్ పోలీస్ స్టేష‌న్ కు బ‌దిలీ చేయ‌డంతో నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు నిందితుడు బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డిన విష‌యం అత‌డి భార్య‌కు సైతం తెలియ‌డం, ఆమె భ‌ర్త‌కే స‌పోర్ట్ చేయ‌డంతో ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌రలించారు.

Next Story