- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేప్ కేసులో జైలుకు.. తిరిగొచ్చాక కూతురుపై అత్యాచారం
రాజస్థాన్ భరత్ పూర్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. 2007లో మైనర్‌పై రేప్, మర్డర్ కేసులో పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాక బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. ఇప్పుడు కూతురుపై అత్యాచారం చేసి, మళ్లీ అరెస్ట్ అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ భరత్ పూర్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. 2007లో మైనర్‌పై రేప్, మర్డర్ కేసులో పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాక బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. ఇప్పుడు కూతురుపై అత్యాచారం చేసి, మళ్లీ అరెస్ట్ అయ్యాడు. మహ్మద్ అర్షద్ జైలు జీవితం గడిపి వచ్చాక సెవర్ పట్టణంలో నివసించాడు. ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాక.. అతనితోనే కూలీ పని చేసుకుంటూ బతికాడు. అతని ఇంటికి కూడా వెళ్లడంతో బాండ్ స్ట్రాంగ్ అయింది. అయితే అతను చనిపోవడంతో భార్యతో మంచిగా మెదిలి.. ఆమె పదిహేనేళ్ల కూతురిని దత్తత తీసుకున్నాడు. కానీ బాగా పెంచి, పెద్ద చేసి, తనకంటూ ఒకరున్నారని చెప్పుకునేందుకు కాదు.. ఆ అమ్మాయిని కూడా బలి చేసేందుకే అని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది.
దాదాపు ఏడాది పాటుగా పాప అత్యాచారం చేస్తున్న మహ్మద్ అర్షద్.. తల్లికి చెప్తే ఇద్దరిని చంపేస్తానని బెదిరించేవాడు. స్కూల్లో దింపి, తీసుకురావడం.. ఎవరితో మాట్లాడకుండా నిఘా ఉంచడం చేశాడు. కానీ ఎలాగోలా అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు.. తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా.. తల్లి పోలీసులను సంప్రదించింది. జూన్ 25న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం తెలిసిన నిందితుడు పరారయ్యాడు. అప్పటి నుంచి గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు.. నేపాల్ సరిహద్దులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.






