- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తులు.. రంగారెడ్డి ఏడీ అరెస్ట్
by Gantepaka Srikanth |
మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తులు.. రంగారెడ్డి ఏడీ అరెస్ట్

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్(Rangareddy Land Records AD Srinivas) అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడీ శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఏడీ శ్రీనివాస్‌కు రాయదుర్గం మైహోం భుజాలో ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపురంలో మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్‌లో నాలుగు ఎకరాలు, నారాయణపేటలో మూడు ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇంట్లో రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, రెండు విలువైన కార్లు, పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






