- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్ ఉద్యోగినంటూ భారీ మోసం.. రామ్ గోపాల్‌పేట్ పోలీసుల చెంత చిక్కిన కిలాడీ దొంగ
బ్యాంక్ ఉద్యోగినంటూ నమ్మించి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి భారీగా డబ్బులు, బంగారం దోచుకున్న కేటుగాడిని రాంగోపాల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, సికింద్రాబాద్: బ్యాంక్ ఉద్యోగినంటూ నమ్మించి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి భారీగా డబ్బులు, బంగారం దోచుకున్న కేటుగాడిని రాంగోపాల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ జోన్ ఎడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి భరత్ సాయిచంద్ర అనే వ్యక్తి తనను ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. రాఖీ జైన్ అనే మహిళకు సుమారు రూ.2 కోట్ల 80 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ పేరుతో ఆమె నుంచి రూ.10 లక్షల 69 వేల నగదు, అలాగే 190 గ్రాముల బంగారం తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామ్ గోపాల్‌పేట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అంబర్‌పేట ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక కారు, రూ.4 లక్షల నగదు, 160 గ్రాముల బంగారం, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భరత్ సాయిచంద్రపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 8 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ లోన్ల పేరుతో వచ్చే అపరిచితుల మాటలు నమ్మకూడదని, ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.






