ఎర్రకోట పేలుడు బాధ్యులను వదిలిపెట్టం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-11 07:18:20  IST  )

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నిందితుల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పేలుడుకు బాధ్యులైన నింధితుల‌ను అత్యంత క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్‌లో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.

ఎర్రకోట పేలుడు బాధ్యులను వదిలిపెట్టం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నిందితుల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పేలుడుకు బాధ్యులైన నింధితుల‌ను అత్యంత క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్‌లో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పేలుడు ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన 12మందికి సంతాపం తెలుపుతూ ప్ర‌సంగం ప్రారంభించారు. దేశంలోని ప్ర‌ముఖ దర్యాప్తు సంస్థ‌లు ఘ‌ట‌న‌పై క్షుణ్ణంగా ద‌ర్యాప్తు చేస్తున్నాయ‌ని చెప్పారు. ద‌ర్యాప్తు రిపోర్టును త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల ముందు ఉంచుతామ‌ని హామీ ఇచ్చారు. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే సీసీ టీవీ ఆధారంగా ఆత్మాహుతి దాడికి పాల్పడిన నిందితున్ని గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులను, మరికొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Next Story