- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS అధికారి సునీల్ నాయక్ అరెస్ట్
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న IPS అధికారి సునీల్ నాయక్ ఇవాళ ఆరెస్ట్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial Torture Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ (IPS Sunil Nayak)ను గుంటూరు నగరంపాలెం పోలీసులు బీహార్ (Bihar)లో అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన సమయంలో, కస్టడీలో ఆయనపై అమానుషంగా భౌతిక దాడి జరిగిందని నమోదైన కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన, రఘురామపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే, తాజాగా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు సునీల్ నాయక్ బీహార్‌లో తలదాచుకున్నట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా పక్కా సమాచారం అందింది. దీంతో గుంటూరు నగరంపాలెం పోలీసుల స్పెషల్ టీమ్ బీహార్ వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై విచారణ జరుగుతుండగా.. సునీల్ నాయక్ అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






