- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..8మంది అరెస్ట్
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. కాలేజీలోని సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టారు.

దిశ, వెబ్ డెస్క్/ నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. కాలేజీలోని సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టారు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాహుల్ రెడ్డిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 2020 బ్యాచ్‌కు చెందిన సీనియర్లు ఇంటర్న్‌షిప్ చేస్తూ అదే కాలేజీలో ఉండి రాహుల్ రెడ్డిని ర్యాగింగ్ చేశారు.
రాహుల్ పోస్టింగ్‌కు వెళ్లినా సీనియర్ ఆబ్సెంట్ వేశారు. దీని గురించి మాట్లాడటానికి రాహుల్ రెడ్డి వెళ్లగా పది మంది సీనియర్లు అతడిపై దాడి చేశారు. తనకు జాండిస్ వచ్చినా, రిపోర్టులు చూపించినా సీనియర్లు వదల్లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి పాల్పడిన సీనియర్ హౌస్ సర్జన్లపై చర్యలు తీసుకోవాలని జూనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ర్యాగింగ్ చేసినవారిలో పవన్, శ్రవణ్, అభినవ్ పెద్ది, సాక్షి హృదలయ్ పాల్, తదితరులన్నారన్నారు. దాడి చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.






