- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. 4th క్లాస్ విద్యార్థికి చిత్రహింసలు
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. 4th క్లాస్ విద్యార్థికి చిత్రహింసలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజినీరింగ్, మెడిసిన్, తదితర కాలేజీల్లోనే ర్యాగింగ్ జరుగుతుందనే భావనను తలకిందులు చేస్తూ.. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో చిన్నారులే ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై ఆరో తరగతి విద్యార్థులు శారీరక, మానసిక వేధింపులకు దిగినట్లుగా సమాచారం. విశ్వసనీయమైన సమాచారం మేరకు... నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి రాత్రిపూట పడుకున్న తర్వాత ఆరో తరగతి విద్యార్థులు గదిలోకి వచ్చి నిద్రలేపి 50కి పైగా గుంజీలు తీయించడంతో పాటు ఏదో స్ప్రే చేసిన బిస్కట్లు తినిపించారని తెలుస్తోంది. దీంతో ఆ విద్యార్థి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని సమాచారం. దీనిపై స్పోర్ట్స్ స్కూల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఏదో విధంగా ర్యాగింగ్ చేస్తూ విద్యార్థిని బెదిరిస్తుండటంతో తీవ్రమైన ఆందోళనకు గురై తాను ఇంటికి వచ్చేస్తానని ఆ విద్యార్థి రోదిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన స్పోర్ట్స్ స్కూల్‌లో కనీస పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.






