- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య-భర్తల మధ్య గొడవ.. ఆత్మహత్య..!
భార్య, భర్తల మధ్య గొడవ కారణంగా భార్య పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది.

దిశ, జమ్మికుంట : భార్య, భర్తల మధ్య గొడవ కారణంగా భార్య పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట వడ్డెర హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే శివరాత్రి కవిత, కొమురయ్య దంపతుల పెద్ద కుమార్తె అశ్వినికి దామర గ్రామానికి చెందిన ఆలకుంట కుమార్ కి 11 సంవత్సరాల కిందట వివాహ జరిగింది. వీరికి పాప, బాబు కలరు. గత కొద్ది రోజుల నుంచి భార్య భర్తలకు గొడవ జరుగుతోంది. కుమార్ అశ్విని ని అదనపు కట్నం కింద రూ.5లక్షలు కావాలని వేధించేవాడని.. కుమార్ తండ్రి సారయ్య, అన్న రాజు కూడా అశ్విని ని వేధించినట్టు సమాచారం.
గత మూడు నెలల కిందటే పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిపించారు. ఆ తరువాత అల్లుడు కుమార్ జమ్మికుంట వచ్చి కూతుర్ని కొట్టాడు. అదనపు కట్నం తీసుకొని ఇంటికి రావాలని.. లేదంటే మీ అమ్మగారి ఇంటి వద్దనే ఉండాలని చెప్పాడు. ఆ బాధను భరించలేక అశ్విని పురుగుల మందు తాగింది. దీంతో జమ్మికుంటలోని విజయసాయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వరంగల్ మెడికేర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వరంగల్ మెడికేర్ ఆసుపత్రిలో అశ్విని చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో తన కూతురు మరణానికి కారణమైన అల్లుడు కుమార్, అతని తల్లి లచ్చమ్మ, తండ్రి సారయ్య, కుమార్ అన్న రాజు పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.






