- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
QNET: క్యూనెట్ కోరల్లో ఐటీ ఉద్యోగులు.. SIT విచారణలో విస్తుపోయే నిజాలు
హైదరాబాద్ క్యూనెట్ స్కామ్‌లో సిట్ విచారణ సంచలనాలు వెలుగు చూశాయి. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా లోన్లు ఇప్పించి మరీ కేటుగాళ్లు రూ.వందల కోట్లు ముంచేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వేల కోట్ల రూపాయల మేర జరిగిన క్యూనెట్ కుంభకోణంపై సిట్ (SIT) విచారణ ముమ్మరం చేసింది. మోసపోయిన బాధితులు వేల సంఖ్యలో ఉండటం, వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో హైదరాబాద్ సిటీ సీపీ నేతృత్వంలోని సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. క్యూనెట్ మోసాలకు సంబంధించి అరెస్టయిన 32 మంది నిందితుల్లో మొదటి విడతగా 10 మందిని సిట్ అధికారులు 10 రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను, ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిని ఈ ముఠా పక్కా ప్రణాళికతో బుట్టలో వేసుకున్నట్లుగా తేలింది. ఐటీ ఉద్యోగులకు బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయనే విషయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు, వారిని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు (Personal Loans) ఇప్పిస్తామని నమ్మబలికి, ఆ డబ్బును క్యూనెట్‌లో పెట్టుబడిగా పెట్టించారు.
ఒక్కో ఏజెంట్‌కు 500 మంది టార్గెట్..
ఈ నెట్‌వర్క్ ఎంత పకడ్బందీగా ఉందంటే.. ఒక్కో ఏజెంట్‌కు దాదాపు 500 మంది ఐటీ ఉద్యోగులను చేర్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. పెట్టుబడి పెట్టడానికి డబ్బుల్లేని ఐటీ ఉద్యోగులకు నిందితులే మధ్యవర్తులుగా వ్యవహరించి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. ఆ మొత్తంపైనే పెట్టుబడులు పెట్టించారు. ‘రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు పెట్టుబడిగా పెట్టండి.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే లాభాల రూపంలో రూ.3 నుంచి రూ.4 కోట్లు సంపాదించండి’ అంటూ టెకీలకు ఆశ చూపారు. భారీ లాభాలు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన ఉద్యోగులు తాము పెట్టిన డబ్బులకు లాభాలు రాకపోగా, ఒకవేళ కమీషన్ రావాలంటే మరికొందరిని ఈ ఊబిలోకి దింపాల్సి ఉంటుందని తెలియడంతో బాధితులు విస్తుపోయారు. అయితే, బాధితులు తమపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు నిందితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పెట్టుబడి పెట్టే ముందే వారి నుంచి కొన్ని లీగల్ బాండ్లను రాయించుకున్నారు. దీనివల్ల ఇది కేవలం వ్యాపార నష్టమే తప్ప మోసం కాదని కోర్టులో వాదించి తప్పించుకోవాలని నిందితులు ప్లాన్ చేశారు.
ఐటీ కారిడార్‌లో అలజడి
హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే వందలాది మంది ఈ క్యూనెట్ వలలో చిక్కుకున్నట్లు సిట్ గుర్తించింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమై, విలాసవంతమైన జీవనశైలిని చూపిస్తూ వీరిని ఈ మాయాజాలంలోకి లాగినట్లు విచారణలో తేలింది.






