- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ఇద్దరిని కారుతో ఢీ కొట్టి చంపిన యువకుడికి బెయిల్.. ఇంటికి డ్యాన్సులతో వెల్ కమ్ చెప్పిన తల్లిదండ్రులు
ఇద్దరిని కారుతో ఢీ కొట్టి వారి మరణానికి కారణమైన నిందితుడికి జైలుకు వెళ్లిన 22నెలల్లోనే బెయిల్ మంజూరైంది. దీంతో నిందితుడి కుటుంబం డ్యాన్సులు చేస్తూ సంబురంగా అతడిని ఇంట్లోకి ఆహ్వానించగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరిని కారుతో ఢీ కొట్టి వారి మరణానికి కారణమైన నిందితుడికి జైలుకు వెళ్లిన 22నెలల్లోనే బెయిల్ మంజూరైంది. దీంతో నిందితుడి కుటుంబం డ్యాన్సులు చేస్తూ సంబురంగా అతడిని ఇంట్లోకి ఆహ్వానించగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహరాష్ట్రలోని పూణేకు చెందిన 17 ఏళ్ల వేదాంత్ అగర్వాల్ అనే వ్యక్తి 2024లో ఖరీదైన కారుతో బైక్ పై వెళుతున్న అశ్విని, అనీష్ అనే టెకీలను ఢీ కొట్టాడు. తీవ్రగాయాలపాలైన ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. యాక్సిడెండ్ చేసిన సమయంలో వేదాంత్ మద్యం మత్తులో ఉన్నాడు. అంతే కాకుండా నిందితుడు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నట్టు విచారణలో తేలింది. యాక్సిడెంట్ చేసిన పదిహేను రోజుల్లోనే నిందితుడికి బెయిల్ మంజూరు అవ్వడంతో అప్పట్లో తీవ్రవిమర్శలు వచ్చాయి.
దీంతో కేసుపై మరోసారి విచారణ జరిపి జైలుకు పంపించారు. అయితే నిజానికి ఈకేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడాల్సి ఉంది. కానీ కేవలం రెండేళ్లకే మళ్లీ అతడు బెయిల్ పై బయటకు వచ్చాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు నోట్ల కట్టలతో తయారు చేసిన మాలలు మెడలో వేసుకుని, డ్యాన్సులు చేస్తూ అతడిని ఇంట్లోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మరోసారి న్యాయవ్యవస్థపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుంటే ఎంతటి నేరం చేసైనా తప్పించుకోవచ్చని అంటున్నారు. కుమారుడు ఇద్దరి మరణానికి కారణమయ్యాడనే బాధ లేకుండా కుటుంబ సభ్యులు చేసిన సంబురాలపై మండిపడుతున్నారు.






