- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుణే కల్తీ మద్యం మరణాల కేసు.. 13 మంది ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
పుణే కల్తీ మద్యం మరణాల కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా 13 మంది ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్: పుణేలో కల్తీ మద్యం తాగి శుక్రవారం 11 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. అక్రమ మద్యం విక్రయాలు, సరఫరాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైనందుకు, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (State Excise Department)కు చెందిన 13 మంది అధికారులను తక్షణమే సస్పెండ్ (13 officers suspended) చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పుణే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Excise Department) సూపరింటెండెంట్ అతుల్ కనాడే అధికారికంగా ధృవీకరించారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు శాఖకు చెందిన మరో నలుగురు సిబ్బంది ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ అక్రమ మద్యం మరణాల కేసును ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.






