పబ్ లో పరిచయంతో మత్తుకు అలవాటు.. దందా షురూ

by Bhanu |

కూరగాయాల దుకాణంలో ఉంటునే మరో వైపు డ్రగ్స్ దందా చేస్తున్న ఓ యువకుడిని తెలంగాణ ఈగిల్ పోలీసులు అరెస్టు చేశారు.

పబ్ లో పరిచయంతో మత్తుకు అలవాటు.. దందా షురూ
X

దిశ, సిటీక్రైం : కూరగాయాల దుకాణంలో ఉంటునే మరో వైపు డ్రగ్స్ దందా చేస్తున్న ఓ యువకుడిని తెలంగాణ ఈగిల్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు వచ్చిన మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడిని కూడా ఈగిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈగిల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సింధి కాలనీకి చెందిన మోహిత్ డిగ్రీ (బీకామ్) చదివాడు. అయితే కొన్ని సబ్జెక్ట్ లు బ్యాక్ లాగ్ ఉండడంతో తన తండ్రి హోల్ సేల్ కూరగాయాల మార్కెట్ లో ఉంటున్నాడు.


అయితే ముంబాయిలోని ఓ పబ్ లో పరిచయమైన వ్యక్తితో మోహిత్ ఓజీ కుష్ మత్తు పదార్ధానికి అలవాటు పడ్డాడు. ఇలా మోహిత్ తన కోసంతో పాటు ప్రత్యేక నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుని ఈ ఓజీ కుష్ , ఎక్సటసీ పిల్స్ ను విక్రయిస్తు డబ్బులు సంపాదిస్తున్నాడు. వీటి ముంబాయిలో పరిచయమైన వ్యక్తికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇవ్వడంతో అతను కొరియర్, లేదా తన మనుషులను పంపించి మోహిత్ కు డెలివరి చేస్తున్నాడు. రెండు రోజుల కిందట కూడా మోహిత్ ఆర్డర్ ఇవ్వడంతో ప్రధాన సరఫరాదారుడు మధ్యప్రదేశ్ కు చెందిన తన అనుచరుడు స్వప్నిల్ వార్థే ను హైదరాబాద్ కు పంపించాడు. అయితే మోహిత్ , స్వప్నిల్ లు ఉప్పల్ స్టేడియం పార్కింగ్ వద్ద 200 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 32 ఎక్సటసీ పిల్స్ విక్రయించేందుకు నిలబడ్డారు.

ఈ సమాచారం అందుకున్న ఈగిల్ పోలీసులు డెకాయ్ అపరేషన్ చేశారు. డ్రగ్స్ తో మోహిత్, స్వప్నిల్ ను అరెస్టు చేశారు. మొత్తం 10 లక్షలు విలువ చేసే మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే విధంగా మోహిత్ నుంచి ఎవరెవరు ఓజీకుష్ గంజాయి, ఎక్సటసీ పిల్స్ ను తీసుకొంటున్నారో వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్ లను నుంచి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్ధాల దందా గురించి సమాచారం ఉంటే ఈగిల్ టోల్ ఫ్రీ నెంబరు 1908 కు అందించాలని అధికారులు కోరుతున్నారు.

Next Story