మెట్రో ఫేజ్-2 పనులు చేపట్టాలని నిరసన.. బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి అరెస్ట్

by Kema Shiva Kumar |

భారత రాష్ట్ర సమితి రాజేంద్రనగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి (Karthik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

మెట్రో ఫేజ్-2 పనులు చేపట్టాలని నిరసన.. బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్ర సమితి రాజేంద్రనగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి (Karthik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు సెకండ్ ఫేజ్ రెండో దశ మెట్రో పనులను యథావిధిగా చేపట్టాలని ఇవాళ ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. గతంలో మెట్రో ఫేజ్-2 పనులకు వేసిన శిలాఫలకం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతుండగా నార్సింగి పోలీసులు మాదాపూర్ మైండ్‌స్పేస్ వద్ద కార్తీక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా, రూ.24,200 కోట్ల వ్యయంతో గత సర్కార్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (HAML) ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 63 కి.మీ ప్రతిపాదిత ప్రాజెక్ట్ గచ్చిబౌలి, విమానాశ్రయం, ఇతర ప్రధాన నివాస కేంద్రాలను కలుపుతూ రాయదుర్గంలో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ, అనంతరం రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతో ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (HAML) ప్రాజెక్టును రద్దు చేసిన విషయం తెలిసిందే.

Next Story