డ్రగ్స్​ ఇచ్చి బాలికలతో వ్యభిచారం.. బయటపడ్డ కిలాడి లేడీ వ్యవహారం

by Sridhar Babu |   (  Updated:2025-03-15 14:22:02  IST  )

డ్రగ్స్‌కు బానిసైన ఓ లేడీ తనతోపాటు మరి కొందరితో ఓ ముఠాగా ఏర్పడి నగరంలో వ్యభిచారం నడుపుతున్న ఉదంతం బయటపడింది.

డ్రగ్స్​ ఇచ్చి బాలికలతో వ్యభిచారం.. బయటపడ్డ కిలాడి లేడీ వ్యవహారం
X

దిశ, వరంగల్ : డ్రగ్స్‌కు బానిసైన ఓ లేడీ తనతోపాటు మరి కొందరితో ఓ ముఠాగా ఏర్పడి నగరంలో వ్యభిచారం నడుపుతున్న ఉదంతం బయటపడింది. బాలికలు పాఠశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వారిలో మాటలు కలిపి చనువుగా ఉంటూ వారికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత వారిని అత్యాచారం చేయిస్తున్న ఘటన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆ లేడీ వరంగల్ నగరంలో కొంత కాలంగా నివాసం ఉంటుంది.

అయితే రెండు రోజుల క్రితం ఓ బాలిక మిస్ అయిందని ఆ బాలిక తల్లిదండ్రులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలికను పోలీసులు ప్రశ్నించారు. దాంతో కిలాడి లేడీ బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత తనకేం జరిగిందో గుర్తు లేదని, స్పృహలోకి వచ్చిన తర్వాత తనని కొందరు వదిలేసి వెళ్లారని బాధితురాలు తెలిపింది. దాంతో పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిని అత్యాచారం చేసినట్టు నిర్ధారించారు. ఆ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ లేడీని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితురాలు ఎవరు, ఆ ముఠా సభ్యులు ఎవరు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story