బ్యూటీ పార్లర్ అండ్ స్పా ముసుగులో వ్యభిచారం.. నిర్వాహకుడి తో పాటు 10 మంది యువతులు అరెస్ట్..

by Disha Web Desk 11 |
బ్యూటీ పార్లర్ అండ్ స్పా ముసుగులో వ్యభిచారం.. నిర్వాహకుడి తో పాటు 10 మంది యువతులు అరెస్ట్..
X

దిశ, మియాపూర్: బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును మియాపూర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ ఆల్విన్ కాలనీలో గల ఏ వన్ బ్యూటీ పార్లర్ అండ్ స్పాపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

అక్కడ నిర్వాహకుడు మియాపూర్ కు చెందిన అజయ్ కుమార్ (33) తో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతులను, నలుగురు విటులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నలుగురు విటులు ఆంధ్రప్రదేశ్ చెందిన వారీగా, అమ్మాయిలు ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. అమ్మాయిలను మహిళ సంరక్షణ కేంద్రానికి (రెస్క్యూ హోమ్) తరలించారు. వారి వద్ద నుంచి 10 సెల్ ఫోన్లు, 13 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story