- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో తీవ్ర విషాదం.. పెళ్లైన 45 రోజులుకే నవ వధువు ఆత్మహత్య
విశాఖపట్నంలో పెళ్లైన 45 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమై కేవలం నెలన్నర కూడా గడవక ముందే ఓ నవ వధువు అన్యాయంగా బలైంది. భర్త అక్రమ సంబంధాలు, పెట్టిన చిత్ర హింసలు భరించలేక తేజశ్రీ (Tejasri) అనే వివాహిత ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. పోలీసుల కథనం మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోమేశ్వర రావు (Someswara Rao)కు, తేజశ్రీకి 45 రోజుల క్రితమే ఘనంగా వివాహం జరిగింది. సోమేశ్వర రావు విశాఖపట్నం (Visakhapatnam)లో ఓ లేడీస్ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. వివాహం తర్వాత వీరిద్దరూ విశాఖలోనే నివసిస్తున్నారు. అయితే, సోమేశ్వర రావు ప్రవర్తనలో మార్పును గమనించిన తేజశ్రీ, అతను ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లుగా గుర్తించింది.
నిలదీసినందుకు చిత్రహింసలు..
భర్త అక్రమ సంబంధాల గురించి తేజశ్రీ సోమేశ్వర రావును నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన సోమేశ్వర రావు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. వివాహమైన నాటి నుంచే ఆమెను చిత్ర హింసలకు గురిచేయడంతో తేజశ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త పెడుతున్న హింసను భరించలేక, తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తేజశ్రీ ఆఖరికి బలవన్మరణానికి పాల్పడింది. తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం (Post-mortem) నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు తేజశ్రీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమేశ్వర రావుపై కేసు నమోదు చేవారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






