- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్‌కుమార్ డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం కంప్లీట్.. తీసుకునేందుకు కుటుంబ సభ్యుల నిరాకరణ
ఆరు హత్యల నిందితుడు రాజ్‌కుమార్ డెడ్‌బాడీకి పోస్టుమార్టం పూర్తి అయింది.

దిశ, వెబ్‌డెస్క్: షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడ (Daivalaguda) ఆరుగురి హత్యాకాండ ఉదంతంలో నిందితుడు రాజ్‌కుమార్ (Raj Kumar) మృతదేహానికి పోస్ట్‌మార్టం ఎట్టకేలకు పూర్తి అయింది. అయితే, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పోస్ట్‌మార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు పూర్తిగా నిరాకరించారు. ‘రాజ్‌కుమార్‌కు, మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని కుటుంబ సభ్యులు రాతపూర్వకంగా రాసి పోలీసులకు లేఖ ఇచ్చినట్లుగా సమాచారం. ఆరుగురి ప్రాణాలను బలిగొన్న క్రూరమైన ఘటన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తిరస్కరణతో రాజ్‌కుమార్ డెడ్‌బాడీకి చేవెళ్ల శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనాథ శవంగా భావించి చట్టప్రకారం పోలీసులే అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు.






