- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో షాకింగ్ ఘటన.. డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
చిత్ర పరిశ్రమలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు టామ్ చాకో(Tom Chacko) అరెస్ట్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు టామ్ చాకో(Tom Chacko) అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసు(Drugs Case)లో ఆయన్ను కేరళలోని కొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవలే కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్ పోలీసుల బృందం అక్కడ తనిఖీలు చేసింది. అధికారుల బృందం హోటల్‌లోకి రావడాన్ని గమనించిన నటుడు.. గోడ దూకి పారిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడో అంతస్తులో ఉన్న టామ్ చాకో.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి అక్కడినుంచి మెట్ల మార్గం గూండా పారిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన్ను కొచ్చిలో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. అంతేకాదు.. టామ్ చాకోపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు ‘అమ్మ’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. టామ్ చాకో తెలుగులో నాని హీరోగా నటించిన దసరా మూవీలో కీలక పాత్ర పోషించారు.






