పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య..

by Bhanu |

మంచిర్యాలలో మైనింగ్ డిప్లొమా మూడవ సంవత్సరం చదువుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన

పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య..
X

దిశ, హనుమకొండ : మంచిర్యాలలో మైనింగ్ డిప్లొమా మూడవ సంవత్సరం చదువుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలకలం రేపుతోంది. మృతుడు చింతల అక్షయ్ (20) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలిపురం గ్రామానికి చెందినవాడు. తండ్రి నరసయ్య బోర్‌వెల్ వాహనంలో పనిచేస్తుండగా, అక్షయ్ మంచిర్యాల రూరల్ రెవెన్యూ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తూ డిప్లొమా చదువుతున్నాడు.

శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story