టెలిగ్రామ్‌లో సినిమాలు చూసేవారికి పోలీసుల వార్నింగ్

by Ajay Maddhiboyina |

కొత్త సినిమా విడుదలైందంటే చాలు కొంతమంది టెలిగ్రామ్ గ్రూపుల్లో వెతికి చూస్తుంటారు. పైరసీ సినిమాలు రికార్డ్ చేయడమే కాదు చూడటం కూడా నేరమే.

టెలిగ్రామ్‌లో సినిమాలు చూసేవారికి పోలీసుల వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త సినిమా విడుదలైందంటే చాలు కొంతమంది టెలిగ్రామ్ గ్రూపుల్లో వెతికి చూస్తుంటారు. పైరసీ సినిమాలు రికార్డ్ చేయడమే కాదు చూడటం కూడా నేరమే. కానీ చాలా మంది అది పట్టించుకోకుండా చూస్తుంటారు. అలా టేలిగ్రామ్‌లో సినిమాలు చూసేవాళ్లకు తెలంగాణ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవీల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో లింకులు పంపి, ఏపీకే ఫైల్స్ పంపి కీలకమైన సమాచారాన్ని ఫోన్ నుండి దోచేస్తున్నారు.

కాబట్టి టెలిగ్రామ్ లో కూడా కొత్త సినిమాల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. కొత్త సినిమాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్స్ క్లిక్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. థర్డ్ పార్టీ యాప్స్, ఏపీకే ఫైల్స్‌తో డేటాను చోరీ చేస్తారని పేర్కొన్నారు. పైరసీ సినిమాల కోసం వెళ్లి ఖాతాలను ఖాళీ చేసుకోవద్దని సూచించారు. ఇదిలా ఉంటే సైబర్ నేరగాళ్లు అమాయకులకు గాలం వేసేందుకు కొత్త దారులు తొక్కుతున్నారు. ఛాన్స్ దొరికితే లక్షలు, కోట్లల్లో కాజేస్తున్నారు. కాబట్టి సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

Next Story