దీపావళి వేళ ఫ్రీగా గిఫ్టులే గిఫ్టులు.. తీరా చూస్తే!

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-13 06:56:20  IST  )

ఇంట్లో కూర్చొని రూ.లక్షలు సంపాదించొచ్చు.. వందకే వేయి రూపాయల విలువజేసే బహుమతి అంటూ నిత్యం సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి.

దీపావళి వేళ ఫ్రీగా గిఫ్టులే గిఫ్టులు.. తీరా చూస్తే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో కూర్చొని రూ.లక్షలు సంపాదించొచ్చు.. వందకే వేయి రూపాయల విలువజేసే బహుమతి అంటూ నిత్యం సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ఇటీవల ఇలాంటి ప్రకటనల మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇలాంటి ప్రకటనలు, ఉచితాలపై అప్రమత్తంగా ఉడాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉచితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఉచితంగా వచ్చే గిఫ్ట్‌ కోసం ఆశపడొద్దు. విరాళాలు ఇస్తాం, గిఫ్ట్‌ పంపిస్తామంటూ నమ్మించి మోసగిస్తారు. కస్టమ్స్ డ్యూటీ, ట్యాక్స్ అంటూ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు జాగ్రత్త. ఫ్రీగా వస్తున్నాయంటే మోసం ఉందని గుర్తుంచుకోండి. సైబర్ మోసానికి గురైనట్లు తెలిస్తే వెంటనే 1930కు కంప్లైంట్ చేయండి’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Next Story