సింగర్ కల్పన భర్తపై అనుమానం?.. ఇంట్లో మరోసారి పోలీసుల తనిఖీలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-04 16:45:13  IST  )

టాలీవుడ్(Tollywood) సీనియర్ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

సింగర్ కల్పన భర్తపై అనుమానం?.. ఇంట్లో మరోసారి పోలీసుల తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) సీనియర్ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నిద్ర మాత్రలు మింగి రెండ్రోజులుగా బెడ్ రూమ్‌కే పరిమితం అయిన ఆమెను.. పోలీసుల సాయంతో మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, కల్పన భర్తపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణను ముమ్మరం చేశారు. ఆసుపత్రికి వచ్చిన ఆమె భర్తను.. అక్కడి నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి మరోసారి తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు రోజులు తాను ఇంట్లో లేనని.. బయటకు వెళ్లానని కల్పన భర్త చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. సింగర్ కల్పన నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ వీలేజ్ గేటెడ్ కమ్యూనిటీ(Vertex Privilege Gated Community)లో ఆమె భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు.

రెండ్రోజులుగా ఆమె ఇంటి నుంచి బయటకు రాకపోవడం, బయట లాక్ వేయకపోవడాన్ని గమనించిన ఆపార్ట్‌మెంట్ వాసులు.. అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చి ఆమె ఫోన్‌కు పలుమార్లు కాల్ చేశారు. ఆమె లిఫ్ట్ చేయలేదు. అనంతరం భర్తకు కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన కూడా పలుమార్లు కల్పనకు కాల్ చేసినట్లు సమాచారం. ఎంతకీ కల్పన నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సాయంతో డోర్ బద్దలు కొట్టి.. అప్పటికే స్పృహతప్పి పడిపోయిన ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

Next Story