గాలిపటాల మాంజాపై పోలీసుల నిఘా.. అవి విక్రయం, వినియోగం చేస్తే కేసులే..!

by Ramesh Naini |

గాలిపటాల చైనీస్ మాంజా విక్రయం, వినియోగంపై జిల్లా పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

గాలిపటాల మాంజాపై పోలీసుల నిఘా.. అవి విక్రయం, వినియోగం చేస్తే కేసులే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గాలిపటాల చైనీస్ మాంజా విక్రయం, వినియోగంపై జిల్లా పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. చైనీస్ మాంజా అమ్మకం గానీ, వినియోగం గానీ చేపడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ASIFABAD జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ హెచ్చరించారు. చైనీస్ మాంజా నాణ్యత లేని పదార్థాలతో తయారు అవుతుండటంతో ప్రమాదాలకు కారణమవుతోందని తెలిపారు. వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ మాంజాను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, జంక్షన్లు, మార్కెట్ల వద్ద మాంజా దారం కారణంగా పలువురు గాయపడుతున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

చైనీస్ మాంజా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల తనిఖీలు చేపట్టి మాంజా రీల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా చైనీస్ మాంజా వినియోగాన్ని మానుకోవాలని, పిల్లలను కూడా దాని నుంచి దూరంగా ఉంచాలని ఎస్పీ సూచించారు. చైనీస్ మాంజా వల్ల జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Next Story