- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయశాంతి రెడ్డి డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసును పోలీసులు ఛేదించారు. మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ విజయశాంతి రెడ్డి డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. దాదాపు 20 రోజులపాటు చేసిన దర్యాప్తును కొలిక్కి తెచ్చారు. తన కుమారుడు, కూతురుతో కలిసి ఆత్మహత్య పాల్పడటానికి గల కారణాలను అన్ని కోణాల నుంచి విశ్లేషించి ఓ నిర్ణయానికి వచ్చారు. ఒంటరితనం, మానసిక ఒత్తిడితోనే విజయశాంతి రెడ్డి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తేల్చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ కీలక విషయాలను రాబట్టారు. ఇంతకూ ఈ కేసులో రైల్వే పోలీసులు ఏం చెబుతున్నారంటే..
అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్
జనవరి 31న అర్ధరాత్రి దాటిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయశాంతి రెడ్డి తన కుమారుడు విశాల్ రెడ్డి, కూతురు చేతన రెడ్డితో కలిసి చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెలుగు స్టేట్స్‌లో పెను సంచలనంగా మారిన ఈ ఆత్మహత్యలపై పలు అనుమానాలు రేకెత్తాయి. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు సైతం అనుమానస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు ఎంక్వైరీకి స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో వేగవంతంగా దర్యాప్తు చేశారు.
సూసైడ్ నోట్ ఆమె రాసిందే..
కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా విజయశాంతి రెడ్డి ప్రయాణించిన ఉప్పల్ టు పటాన్ చెరు వరకు సీసీకెమెరాల ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. ఆమె కారులో లభించిన సూసైడ్ నోట్‌ను సైతం ఆమె రాసిందని నిర్ధారించారు. దీనికి ఆమె సోదరుడి సహాయం తీసుకున్నారు. అలాగే ఆమె ఆస్తులు, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొబైల్, ల్యాప్‌టాప్‌లను ఫొరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించగా.. వాట్సప్‌లో కొందరితో చేసిన చాటింగ్‌లను డిలీట్ చేసినట్టు గుర్తించారు. డిలీట్ చేసిన మెసేజ్‌లను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నో డౌట్..
విజయశాంతి రెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్యపై తమనకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవని చెప్పారు. విజయశాంతి రెడ్డి ఐటీ కంపెనీలో ఉన్నతస్థానంలోనే ఉద్యోగం చేస్తుందని, భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, ఈ క్రమంలో వారికి ఆర్థిక ఇబ్బందులు లేవని తేల్చిచెప్పారు. బంధువులు, స్నేహితులతోనూ వివాదాలు లేవని పేర్కొన్నారు.
పోలీసులు ఏం తేల్చారు?
విజయశాంతి రెడ్డి తన పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నుంచి, ఆ తర్వాత ఆమె ప్రయాణించిన రోడ్డు మ్యాప్‌లో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తే ఎలాంటి అనుమానస్పద పరిస్థితులు, వ్యక్తులు లేరని పోలీసులు చెబుతున్నారు. రైలును ఢీకొనే ముందు లోకోపైలట్ చూసిన సమయంలోనూ పరిసర ప్రాంతాల్లో ఇతర వ్యక్తులు లేరని తేలింది. ఒంటరి తనానికి గురయ్యే విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు రైల్యే పోలీసుల ఫైనల్ రిపోర్ట్ చెబుతుంది. భర్త దుబాయ్‌లో ఉండటం.., పిల్లలు ఇద్దరు హాస్టళ్లలో ఉండటం.. తాను ఐటీ కంపెనీలో రాత్రి డ్యూటీలు చేస్తుండటంతో మానసికంగా ఇబ్బందిపడ్డట్టు తేల్చారు. అందరు ఉన్నా ఒంటరిగా మారిపోయాను అనే భావన ఆమెలో బలంగా నాటుకుపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయశాంతి రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై.. నేను లేకపోతే తన పిల్లలు కూడా ఒంటరి వాళ్లు అవుతారని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. తన ఒంటరి తనాన్ని తరచూ స్నేహితుల వద్ద ప్రసావిస్తూ ఆందోళన చెందేదని, గడిచిన రెండు నెలలుగా ఆమెలో ఒత్తిడి మరింత పెరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే విజయశాంతిరెడ్డి బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.






