Police Raid: విషతుల్యమైన స్నాక్స్ తయారీ.. పక్కా ప్లాన్‌తో పోలీసుల మెరుపు దాడి

by Kema Shiva Kumar |

హైదరాబాద్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో హానికరమైన స్నాక్స్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు.

Police Raid: విషతుల్యమైన స్నాక్స్ తయారీ.. పక్కా ప్లాన్‌తో పోలీసుల మెరుపు దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న నగరంలోని ఓ నకిలీ స్నాక్స్ తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, హానికరమైన రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో H-Fast బృందం సోదాలు చేపట్టింది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ఓ కంపెనీలో ‘కరాచీ పోలో’ (Karachi Polo), ‘రింగ్ లైట్’(Ring Light) పేర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా స్నాక్స్‌ను తయారు చేస్తున్నారు. అయితే, ఈ తయారీ కేంద్రంలో కనీస శుభ్రత పాటించకపోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వీటిని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రమాదకర రసాయనాల వినియోగం..

అయితే, ఈ స్నాక్స్ తయారీలో తక్కువ ధరకే లభించే నాసిరకం నూనెలు, విషతుల్యమైన రంగులు (Toxic Substances) వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అధికారులు దాడి చేసిన సమయంలో అక్కడ నిల్వ ఉన్న భారీ ఎత్తున స్టోర్ చేసిన స్నాక్స్‌, యంత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి నిర్వాహకులను అదుపులోకి తీసకుని విచారిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాలే ధ్యేయంగా పనిచేస్తున్న ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story