హత్యాయత్నం కేసులో నిందితులను ఊరేగించిన పోలీసులు

by Ajay Maddhiboyina |

ఇటీవ‌లి కాలంలో ఏపీ పోలీసులు నిందితుల‌కు వినూత్న శిక్ష‌లు విధిస్తున్నారు.

హత్యాయత్నం కేసులో నిందితులను ఊరేగించిన పోలీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌లి కాలంలో ఏపీ పోలీసులు నిందితుల‌కు వినూత్న శిక్ష‌లు విధిస్తున్నారు. త‌ప్పు చేసి దొరికారంటే తాట తీస్తున్నారు. మ‌రోసారి అలాంటి త‌ప్పులు చేయ‌కుండా, స‌మాజంలోనూ ఎవ‌రైనా త‌ప్పు చేయాలంటే బ‌య‌ప‌డేలా శిక్ష‌లు విధిస్తున్నారు. నిందితుల‌కు కోటింగ్ ఇచ్చి త‌ర‌వాత రోడ్ల‌పై ఊరేగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే క‌ప‌డ జిల్లాలో చోటు చేసుకుంది. క‌డ‌ప టౌన్ లో క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా ఓ వ్య‌క్తిపై ఇద్ద‌రు యువ‌కులు క‌త్తితో దాడి చేశారు. దీంతో నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న క‌డ‌ప 2టౌన్ పోలీసులు సీఐ ప్ర‌సాద్ రావు ఆధ్వ‌ర్యంలో వారి చేతుల‌కు బేడీలు వేసి రోడ్డుపై ఊరేగించారు. భవిష్యత్ లో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని యువకులను పోలీసులు హెచ్చ‌రించారు. అనంత‌రం రిమాండ్ కు తరలించారు. ఇక ఇటీవ‌లే మాజీ సీఎం పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్లెక్సీకి మేక‌ను బ‌లిచ్చిన వారిపై సైతం పోలీసులు ఈ విధంగానే వ్య‌వ‌హ‌రించారు. నిందితుల‌ను రోడ్డుపై ఊరేగించారు.

Next Story