మావోయిస్టుల మందుపాతర పేలి పోలీస్ అధికారి మృతి

by Mallepaka Hamsa |

బస్తర్ జిల్లాలో మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి ఓ పోలీస్ అధికారి మరణించాడు..

మావోయిస్టుల మందుపాతర పేలి పోలీస్ అధికారి మృతి
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: బస్తర్ జిల్లాలో మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి ఓ పోలీస్ అధికారి మరణించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎట్పల్ - తిమెనార్ గ్రామాల మధ్య కొన్ని రోజులుగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, ఇటీవల మావోయిస్టులు రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న వాహనాలకు నిప్పు పెడుతున్న నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు రక్షణ ఏర్పాట్లు చేసారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం పోలీసుల బృందం నిర్మాణ పనులు జరుగుతున్న చోటుకి బయలుదేరింది. ఎట్పాల్ పోలీస్ క్యాంపుకి కిలోమీటర్ దూరానికి రాగానే మావోయిస్టులు రోడ్డు పక్కన అమర్చిన ప్రెషర్ ఐఈడీ బాంబు పేలింది. దీంతో ఏసీపీ విజయ్ యాదవ్ అక్కడికక్కడే మరణించారు. భైరం ఘడ్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మృతదేహానికి శ్రద్దాంజలి ఘటించారు.

Next Story