- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకు అధికారులే సూత్రధారులు: రూ.150 కోట్ల భారీ సైబర్ నెట్‌వర్క్ గుట్టురట్టు!
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సామాన్యుల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంకు అధికారులే నేరగాళ్లతో చేతులు కలిపి ఈ భారీ స్కామ్‌కు తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది. సుమారు రూ.150 కోట్ల మేర జరిగిన ఈ మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 850 కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో మోసాలకు పాల్పడుతుంటారు. కానీ, ఇక్కడ బ్యాంకు అధికారులే నేరగాళ్లతో కుమ్మక్కయ్యారు. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన డబ్బును దారి మళ్లించేందుకు బ్యాంకు అధికారులు నేరగాళ్లకు 'మ్యూల్ అకౌంట్లు' (Mule Accounts) అందించారు. కేవైసీ (KYC) నిబంధనలను పక్కన పెట్టి, నకిలీ పత్రాలతో లేదా అమాయకుల పేరుతో ఖాతాలు తెరిచి నేరగాళ్లకు సహకరించారు.
వందల కోట్లలో లావాదేవీలు..
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెట్‌వర్క్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.150 కోట్లు చేతులు మారాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన దాదాపు 850 సైబర్ కేసుల్లో ఈ అకౌంట్లనే వాడినట్లు టెక్నికల్ అనాలిసిస్‌లో తేలింది. ఒక్కో అకౌంట్ తెరిచినందుకు మరియు లావాదేవీలు సజావుగా సాగేలా చూసినందుకు బ్యాంకు అధికారులు నేరగాళ్ల నుంచి భారీ మొత్తంలో కమీషన్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ ముఠా అరెస్టుతో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. "బ్యాంకు సిబ్బంది సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున మ్యూల్ అకౌంట్లు నడపడం అసాధ్యం. అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం," అని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతా వివరాలను, ఓటీపీలను ఎవరికీ తెలపవద్దని, అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.






