Phone Tapping Case: ప్రభాకర్‌రావే కీలకం.. హైకోర్టులో పోలీసుల కౌంటర్ పిటిషన్

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామ చోటుచేసుకుంది. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.

Phone Tapping Case: ప్రభాకర్‌రావే కీలకం.. హైకోర్టులో పోలీసుల కౌంటర్ పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామ చోటుచేసుకుంది. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రభాకర్ రావే కీలకమని.. పోలీసుల దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడని వివరించారు. ఐపీఎస్‌ అధికారిగా విరమణ పొంది.. చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు. హైదరాబాద్‌ వస్తున్నానని గతంలో ట్రయల్‌కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారనీ వివరించారు. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీని నెలకొల్పింది ప్రభాకర్ రావేనని, ఆయన ఆధ్వర్యంలోనే పని చేసిందని తెలిపారు. ఫోన్‌లు ట్యాప్ చేయడమే లక్ష్యంగా ఎస్‌వో‌టీ విధులు నిర్వహించిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌‌కు పాల్పడి ప్రతిపక్షాలను, కొందరు అధికారులు వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.

Next Story