నగరంలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. రూ.76.87 లక్షల లిక్విడ్ క్యాష్ సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-10 04:46:07  IST  )

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉండటంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలను చేపడుతున్నారు.

నగరంలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. రూ.76.87 లక్షల లిక్విడ్ క్యాష్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్/కార్వాన్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉండటంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ (Gosha Mahal) పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. సరైన లెక్కలు చూపకుండా తరలిస్తున్న రూ.76.87 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ మొత్తానికి సంబంధించి ఎలాంటి బ్యాంక్ పత్రాలు గానీ, ఇతర ఆధారాలు గానీ వారి వద్ద లేకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు, అనుమానాస్పదంగా కనిపిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే, ఆ నగదును ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన సొత్తును ఇన్‌కమ్ టాక్స్ (IT) విభాగానికి అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రూ.50 వేలకు పైగా నగదు తరలించేటప్పుడు తప్పనిసరిగా తగిన ఆధారాలు చూపాలని పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Next Story