కానిస్టేబుల్ పై దాడి.. రౌడీ షీటర్ అనుచరుల తాటతీసిన పోలీసులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-26 16:13:05  IST  )

గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు రౌడీ షీటర్ అనుచరుల తాట తీశారు. నెలరోజుల క్రితం ఐతా నగర్‌లో రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్ కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడి చేశారు.

కానిస్టేబుల్ పై దాడి.. రౌడీ షీటర్ అనుచరుల తాటతీసిన పోలీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు రౌడీ షీటర్ అనుచరుల తాట తీశారు. నెలరోజుల క్రితం ఐతా నగర్‌లో రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్ కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నింధితులను అదుపులోకి తీసుకుని ఐతా నగర్ తీసుకెళ్లి నడీరోడ్డుపై వారికి కోటింగ్ ఇచ్చారు. ముగ్గురినీ పక్క పక్కన రోడ్డుపై కూర్చోబెట్టి అందరూ చూస్తుండగానే లాఠీతో అరికాళ్లపై చితకబాదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మంచిపని చేశారంటూ నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story