- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీడిమెట్లలో ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
by Ajay Maddhiboyina |
వారం రోజుల క్రితం జీడిమెట్లలోని మార్కండేయనగర్లో జరిగిన ఏటీఎం చోరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: వారం రోజుల క్రితం జీడిమెట్లలోని మార్కండేయనగర్లో జరిగిన ఏటీఎం చోరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నింధితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ముగ్గురు నింధితుల నుండి వాళ్లు దొంగలించిన రూ.17 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం బ్రేక్ చేయడానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్లు సీజ్ చేశారు.
ఇదిలా ఉంటే దుండగులు ఈనెల 8న మార్కండేయనగర్ లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో పోలీసులు కార్టెన్ సెర్చ్ నిర్వహించిన కొద్ది సేపటికే చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటనలో దుండగులు ఏటీఎం బాక్సుల నుండి ఏకంగా రూ. 34 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వారం రోజుల్లోనే నింధితులను పట్టుకున్నారు.
Next Story






