- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Police: తక్కువ ధరకే వస్తున్నాయని ఆశ పడ్డారో.. అంతే సంగతి!
మనిషి ఆశాజీవి. దీనిని ఎవరూ కాదనరు. ఉన్నదానితో సంతృప్తి పడకుండా.. ఎప్పుడు ఏదో ఒక దానికోసం ఆరాట పడుతూనే ఉంటాడు.

దిశ, వెబ్‌డెస్క్: మనిషి ఆశాజీవి. దీనిని ఎవరూ కాదనరు. ఉన్నదానితో సంతృప్తి పడకుండా.. ఎప్పుడు ఏదో ఒక దానికోసం ఆరాట పడుతూనే ఉంటాడు. తక్కువ ధరకే ఎక్కువ వచ్చే వస్తులను కొనడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతుంటారు. అయితే.. ఈ ఆశనే కొందరు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరాలకు(Cyber Fraud) పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల భారీగా పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు(Telangana Police) మరో హెచ్చరిక చేశారు. ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఫోన్‌లకు, వాట్సాప్‌లకు ఏదైనా ఆఫర్ లింక్ వస్తే తొందరపడి క్లిక్ చేయొద్దని.. తక్కువ ధరకే వస్తున్నాయని, డిస్కౌంట్ మాయలో పడి జేబు ఖాళీ చేసుకోవద్దని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోస్టులు పెడుతున్నారు.






