- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
POCSO Case: సీన్ రీకన్‌స్ట్రక్షన్.. అరణ్య ఫామ్‌హౌస్‌కు బండి భగీరథ్
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో (POCSO Case) నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ ఉదయం అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బండి భగీరథ్‌కు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు (Medical Examination) చేయించారు. భారీ భద్రత నడుమ అతడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడం, సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలమైన అరణ్య ఫామ్‌హౌస్‌కు (Aranya Farmhouse) నిందితుడిని తీసుకెళ్లగా, అక్కడ అనుకోకుండా ఓ ఫంక్షన్ జరుగుతోంది. దీంతో పోలీసులు నామమాత్రంగా బండి భగీరథ్‌ను కొన్ని ప్రశ్నలు అడిగి, అక్కడి నుంచి మళ్లీ పేట్ బషీరాబాద్ పీఎస్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నిందితుడి నుంచి రాబట్టాలని సిట్ భావిస్తోంది.






